స్వర్గ రథాన్ని వితరణ చేసిన పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2003-04 పదవ తరగతి పూర్వ విద్యార్థిని విద్యార్థులు గ్రామానికి స్వర్గ రథాన్ని వితరణ చేశారు. గ్రామంలో స్వర్గరథం లేని విషయం గమనించి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బంధులను గుర్తించి స్వంత డబ్బులతో స్వర్గరథాన్ని చేయించి గ్రామాభివృద్ధి కమిటీకి అందించారు. ఈ మేరకు ఆదివారం పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వర్గరథాన్ని గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించారు. గ్రామస్థులందరు ఉచితంగా స్వర్గ రథాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ మాట్లాడుతూ ఇంత మంచి నిర్ణయం తీసుకొని గ్రామానికి స్వర్గరథాన్ని అందించిన 2003-04 పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని యువకులందరు ఈ బ్యాచ్ ని స్ఫూర్తిగా తీసుకుని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లౌడియా వసంత్, నోముల నరేందర్, సంధుల గంగారాం, లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love