పూర్వ విద్యార్ధుల చేయూత అభినందనీయం


నవతెలంగాణ పెద్దవంగర: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి పూర్వ విద్యార్ధులు చేయూతనందించడం అభినందనీయమని అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గంగిశెట్టి రమేష్ కుమార్ అన్నారు. పాఠశాలలో 2000-01 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యా బుద్దులు నేర్పిన అలనాటి గురువులు రవీందర్, నర్సింహా మూర్తి, రావు లను శాలువాలతో సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అలనాటి మదుర స్మృతులను నెమరువేసుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు రూ. 10 వేల ఫర్నిచర్ బహూకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వేముల సంతోష్, సోమన్న, మల్లేశం, రాజు మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్యతోనే సమాజానికి తమకు తోచిన స్థాయిలో సేవలు అందిస్తూ నేటి తరానికి ఆదర్శంగా ఉంటామన్నారు. తోటి స్నేహితులు గతంలో వేరువేరు కారణాలతో బెల్లంకొండ అనిల్, పిండి శ్రీనివాస్, కవిత మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ. 35 వేల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులం అంతా కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. గతంలో మృతి చెందిన స్నేహితులతో పాటు, అలనాటి గురువు లక్ష్మినారాయణ లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో రవి, హరీష్, శ్రీనివాస్, షబ్బీర్, మురళి, మోహన్, రంజిత, సరిత, విజయ్, అనేష్, కృష్ణ, మల్లేష్, అశోక్, అనిత, హేమలత, రమాదేవి, అంజయ్య, మస్తాన్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love