యువతకు ఎల్లవేళల అండగా ఉంటా

మాజీ ఎంఎల్‌సీ కొండా మురళీ
నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ తూర్పు నియోజక వర్గంలోనీ ప్రజలకు, యువతకు ఏళ్ల వేలల అండగా ఉంటామని అన్నారు. వరంగల్‌ ఓ హౌటల్‌లో యు వత కోసం కాంగ్రెస్‌ అనే కార్యక్రమాన్ని తోట పవన్‌ అధ్యక్షతన నిర్వ హించారు. కొండా మురళీధర్‌ రావు, కొండా సుస్మిత పటేల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంఎల్‌సీ కొండా మురళి మా ట్లాడుతూ కొండా సుష్మితకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అన్నదమ్ములుఉన్నారనీ చూశానన్నారు. వరంగల్‌ తూర్పులో కొండ సురేఖను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం కొండ సుష్మిత మాట్లాడుతూ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా నేను పోలీస్‌ స్టేషన్‌ ముందు వచ్చి ధర్నా చేస్తా అని అన్నారు. మీమ్ములను ఎవరైనా ఇబ్బంది పెట్టినా కొండా మురళి చూసుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నల్గొండ రమేష్‌, చిప్ప వెంకటేశ్వర్లు, మీసాల ప్రకాష్‌, బొట్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Spread the love