– విద్యా వ్యవస్థ పటిష్టానికి కృషి
– ప్రభుత్వ బడుల బలోపేతానికి చేయూత
2030 సంవత్సరం కల్లా రూ.6 వేల 30 కోట్లతో అభివృద్ధి పనులు విద్యార్థుల అభ్యున్నతికి చర్యలు
అనేక సేవా కార్యక్రమాల నిర్వహణ
విద్యార్థుల సృజనాత్మకత పెంపొందింపు : డైరెక్టర్ సాజీ పికె
ఏడబ్ల్యుఎస్, ఆసియా-పసిఫిక్, జపాన్, చైనా, దేశాలలో కూడా పనిచేస్తుందని డేటా సెంటర్, ఆపరేషన్స్ డైరెక్టర్ సాజీ పికె తెలిపారు. భవిష్యత్ నిర్మాతలైన విద్యార్థుల్లో ప్రేరణను నింపేందుకు కృషి చేశామన్నారు. పునరుద్ధరణ, ఏడబ్ల్యుఎస్ థింక్ బిగ్ స్పేస్ విద్యార్థుల శ్రేయస్సు కోసం పోష కాహార కార్యక్రమం ప్రవేశపెట్టడం, తెలంగాణ సమాజం పట్ల తమకు ఉన్న నిబద్ధతకు ఇందుకు నిదర్శనం అన్నారు. విద్యా సౌకర్యాలు, స్టీమ్-ఆధారిత పాఠ్యాంశాలను అందించడంలో ఏడబ్ల్యుఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తమకు మద్దతు ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
నవతెలంగాణ-కందుకూరు
గ్రామీణ సమాజ అభివృద్ధికి, నేటి తరానికి అమెజాన్ కంపెనీ చేయూతనిస్తోంది. ప్రభుత్వ బడులు బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మర్మమతులు చేపట్టింది. నిరుపేదల విద్యార్థులకు ప్రతి రోజూ పౌష్టికాహారం అందించేందుకు మిల్లెట్, వేరుశెనగ చిక్కీ (చిరుతిండి), రాగి మాల్ట్ లేదా ప్రోటీన్ ఆధారిత పానీయాలు వంటి పోషక పదార్థాలు అందిస్త్నుది. అంతేకుండాకుండా క్రీడారంగాల్లో సృజనాత్మక పెంపొందించేందుకు అనేక కార్యాక్రమాలు చేపడుతోంది. తెలంగాణలోని గ్రామీణ సమాజ అభివృద్ధికి, నేటి తరానికి చేయూతనిచ్చేందుకు ‘ఏడబ్ల్యుఎస్’ నిరంతరం కషి చేస్తుంది. పాఠశాల మౌలిక వసతులు, సైన్స్ అండ్ టెక్నాలజీ లెర్నింగ్ కేంద్రం సప్లిమెంటరీ పోషకాల పంపిణీ, కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనిస్తుంది. ఇటీవల కందుకూరు మండల నేదునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్‌కు చెందిన 1100 మందికి పైగా విద్యార్థులకు సహా సహకారాలు అందజేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) నేదునూరు గ్రామంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో పునరుద్ధరణ పనులను చేపట్టింది. విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం పోషకాహారాలతో నిండిన సప్లిమెంటరీ న్యూట్రీషన్‌ను అందించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని వారం రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు ప్రభుత్వ పాఠశాల్లో మరమ్మతులు చేపట్టింది. అన్ని తరగతి గదుల విద్యుద్దీకరణ, నూతన టాయిలెట్లు, కిచెన్ షెడ్‌లు, డైనింగ్ హాళ్ల నిర్మాణం, పాఠశాలలకు కొత్తగా ఫ్లోరింగ్ నిర్మించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. క్రీడా మైదానాలను మర్మమతులు చేసి, వినియోగంలోకి తీసుకువచ్చారు.
గ్రామీణ పాఠశాలల పిల్లలకు ఉదయం పూట పోషకాహారం అందించే ‘ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్’ మద్దతుతో మిల్లెట్, వేరుశెనగ చిక్కీ (చిరుతిండి), రాగి మాల్ట్ లేదా ప్రోటీన్ ఆధారిత పానీయాలు వంటి రోజువారీ పోషక పదార్థాలు అందిస్తుంది. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మద్దతుతో జడ్పీహెచ్‌ఎస్, టీఎస్‌ఎమ్‌ఎస్ క్యాంపస్‌లో ఏడబ్ల్యుఎస్ థింక్ బిగ్ స్పేస్‌ను ఏర్పాటు చేసింది. ఏడబ్ల్యుఎస్ థింక్ బిగ్ స్పేసెస్ అనేది విద్యార్థులకు (ఎస్‌టీఈ ఎ ఎమ్-స్టీమ్) విభాగాలను ఆసక్తితో అన్వేషించడానికి వాటిలో తగిన పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి కృషి చేస్తోంది. ఏడబ్ల్యుఎస్ భారతదేశంలో 2030 నాటికి 4.4 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమా రు రూ.6,300 కోట్లు) కంటే ఎక్కువ ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో ఏడబ్ల్యుఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్‌ను ప్రారంభించింది. ఏడబ్ల్యుఎస్ ఆసియా పసిఫిక్ (హైదరా బాద్) రీజియన్ నిర్మాణం, నిర్వహణ 2030 నాటికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తికి సుమారు 7.6 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ.63,600 కోట్లు)ను జోడిస్తుందని అంచనా. తెలంగాణలోని ఏడబ్ల్యుఎస్ ఇన్‌కమ్యూనిటీల నూతన కార్యక్రమాలు రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, అంగన్‌వాడీ కేంద్రాల (గ్రామీణ శిశుసంరక్షణ కేంద్రం), ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి బహుళ కార్యక్రమాలను ఏడబ్ల్యుఎస్ ఇప్పటికే చేపట్టింది. ఏడబ్ల్యుఎస్ థింక్ బిగ్ స్పేసెస్ షాబాద్, కందుకూర్, యాచారం, మీర్‌ఖాన్‌పేట్, హైతాబాద్‌ల్లో ప్రారంభమైంది. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తామని కంపెనీ అధికారులు తెలిపారు.