ఆసియా కుబేర కుటుంబాల్లో అంబానీ టాప్‌

Ambani is the top of Asia's Kubera familiesముంబయి: ఆసియాలోనే అత్యంత కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ కుటుంబం టాప్‌లో ఉంది. అగ్రశ్రేణి 20 మంది కుబేరుల్లో భారత్‌కు చెందిన ఆరు కుటుంబాలు ఈ జాబితాలో చోటు సంపాదిం చుకున్నాయని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఈ జాబితాలో మిస్త్రీ, జిందాల్‌, బిర్లా, బజాజ్‌, హిందుజా కుటుంబాలు ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీ సంపద ఏకంగా 90.5 బిలియన్‌ డాలర్లు (రూ.7.86 లక్షల కోట్లు)గా ఉంది. రెండో స్థానంలో థారులాండ్‌కు చెందిన చీరావనోండ్‌ కుటుంబం రూ.3.70 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కాగా.. అంబానీ కుటుంబ సంపదలో దాదాపు ఇది సగం కంటే తక్కువ. ఈ జాబితాలో నాలుగు, ఏడు, తొమ్మిదవ స్థానాల్లో భారత్‌ నుంచి మిస్ట్రీ కుటుం బం, జిందాల్‌ ఫ్యామిలీ, బిర్లా కుటుం బాలు ఉన్నాయి. బజాజ్‌, హిందుజా కుటుంబాలు వరుసగా 14, 19వ స్థానాలను దక్కించుకున్నాయి.

Spread the love