అంబటిపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బంద్..

– పెండింగ్ 6.నెలలుగా బిల్లులు 

– వంట చేయడానికి ఆసక్తి చూపని మహిళలు

నవతెలంగాణ అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో వంట చేయడానికి మహిళలు ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదు. లింగాల మండలం అంబటిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 170 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతినెల విద్యార్థులకు వంట ఖర్చులు 30 వేల పైగా అవుతుంది. గత ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుండి వంట చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి ఆకలితో ఇంటికి పరుగులు పెడుతున్నారు.
       స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  విషయంపై పాఠశాల హెడ్మాస్టర్ ను నవతెలంగాణ వివరణ కోరగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని వంట చేయడానికి మహిళలు ఎవరు ముందుకు రావడం లేదని , బదిలీ పైన ఇక్కడికి కొత్తగా వచ్చాను. గ్రామ పెద్ద మనషులతో చర్చించి మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Spread the love