అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం

– ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– అంబేద్కర్‌ కొందరివాడు కాదు..అందరివాడు
– చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి
– ఆకట్టుకున్న అంబేద్కర్‌ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన
నవతెలంగాణ-చేవెళ్ల
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర పై సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల పట్ల వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్‌ జీవిత విశేషాలు, ఆశయాలు, లక్ష్యాలను నేటి తరానికి తెలియజేయడం కోసం నాటక ప్రదర్శన నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయమన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ చేసిన కృషిని నాటక రూపంలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను సమాజంలోని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. అంబేద్కర్‌ కొందరివాడు కాదనీ, అందరివాడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్య క్రమంలో దళితరత్న అవార్డు గ్రహీత బురాన్‌ ప్రభాకర్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్య దర్శి బోడ సామిల్‌, సీనియర్‌ పాత్రికేయులు బ్యాగరి గోపాల్‌, చేవెళ్ల అంబేద్కర్‌ యువ జన సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్‌, సీఐటీయూ డివిజన్‌ ఇన్‌చార్జి అల్లి దేవేం దర్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ ఇన్‌చార్జి అరుణ్‌ కుమార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు మాధవి, సురేష్‌, జయప్రద, పాండు, ప్రభు త్వ పాఠశాల ఉపాధ్యాయుడు సుధాకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గౌండ్ల యాదయ్య, పామేన ఉప సర్పంచ్‌ బ్యాగరి విజరు, నాయకులు కొజ్జంకి సత్యనారాయణ, మల్కాపూర్‌ రవీందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు
అకట్టుకున్న అంబేద్కర్‌ నాటక ప్రదర్శన
డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రపై సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి చదువుల్లో పడ్డ కష్టాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన విజయాలను కండ్లకు కట్టినట్టు చూపించారు.

Spread the love