అంబేద్కర్ జీవితం స్పూర్తితో ఉన్నతమైన విద్యనభ్యసించాలి: యుఎస్ఎఫ్ఐ

Pursue higher education inspired by Ambedkar's life: USFIనవతెలంగాణ – కంఠేశ్వర్ 

అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు అందరూ ఉన్నతమైన చదువులు అభ్యసించాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాల్కల్ స్కూల్ హాస్టల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న రాంజీ మాలోజి బీమా భాయ్ దంపతులకు జన్మించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా అంబేద్కర్ గారు కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే అంబేద్కర్ గారు దేశ,విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి,న్యాయపట్టా పొందిన విద్యావేత్త అని అన్నారు. స్వాతంత్ర భారతదేశనికి రాజ్యాంగాన్ని రచించడంలో అత్యంత కీలకపాత్ర పోషించి,అణగారిన వర్గాల కోసం,వారి అభివృద్ధి కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలను, హక్కులను కల్పించిన మేధావి అని కొనియాడారు. కానీ అప్పుడు, ఇప్పుడు సంఘవిద్రోహులు అంబేద్కర్ ను ఒక వర్గానికి చెందిన వాడిగా చిత్రీకరిస్తూ, ఆయనపై అనేక విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలంటే అంబేద్కర్ సూచించిన మార్గంలో పయనిస్తూ అంబేద్కర్ అంటే అందరివాడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ఉద్యమకారుడు అని ప్రజలందరికీ తెలిసే రకంగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర నాయకులు బాబురావు, పోశెట్టి, మనోజ్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love