అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

Ambedkar statue anointed with oilనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ పట్ల బిజెపి నాయకుల తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ ఒకపక్క పార్లమెంటులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ, మరోపక్క అంబేద్కర్ విగ్రహ శుద్ధి పేరుతో నిన్న బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసామన్నారు.కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, టౌన్ ప్రెసిడెంట్ నిమ్మ రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నూకల బుచ్చి మల్లయ్య, నాయకులు పూజారి శేఖర్, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, అజారుద్దీన్, పాలేపు చిన్న గంగారం, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love