అభివృద్ధి పథంలో అంబర్‌పేట

రూ.20 కోట్లతో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ సహకారంతో పార్కుల ఆధునీకరణ
రూ.150 కోట్లతో జీహెచ్‌ఎంసీ,
వాటర్‌ వర్క్స్‌ పనులు
రూ.వందకోట్లతో పాఠశాలల పునర్నిర్మాణం
అగ్రగ్రామి నియోజకవర్గంగా అంబర్‌పేటను తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రుల సహకారంతో అంబర్‌పేట నియోజకవర్గాన్ని బహుముఖ వ్యూహాలను అమలు చేస్తూ మౌళిక సదుపాయాల కల్పనతోపాటు నియోజకవర్గ ఇమేజ్‌ను పెంచేందుకు అవసరమైన ప్రణాళి కలను రూపొందించి అమలు చేస్తున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి మళ్లీ మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆధునిక డ్రయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిం చేందుకు అందమైన పార్కులను ఏర్పాట్లు దాదాపు పూర్త య్యాయి. పార్కుల్లో వృద్ధులు పిల్లలు ఉదయం సాయం త్రం, సరదాగా గడిపేందుకు పచ్చని పార్కులు ఎంతగానో ఉపయోగపడుతాయి. చిన్నారుల కేరింతలు, పెద్దల ముచ్చట్లతో పార్కుల్లో సాయంత్రం వేళ ఎంతో ఆహ్లాదకర వాతావరణం అనుకూలంగా మలుచుకుని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో కాచిగూడలో అంజయ్య పార్కు మున్నూరు కాపు భవన్‌ వెనుక భాగం, నల్లకుంట డివిజన్‌ పరిధిలోని లింగాల గడ్డ పార్కు, నరేంద్రర పార్క్‌, ఫీవర్‌ హాస్పిటల్‌ పక్కన వర్టికల్‌ గార్డెన్‌, మోతె నాగేశ్వర్‌ పార్కు, పార్క్‌, బాగ్‌ అంబర్‌ పేట డివిజన్‌ పరిధిలోని సోమ సుందర్‌ పార్క్‌, రామకృష్ణ పార్క్‌, ఎస్బీఐ కాలనీ పార్క్‌, వైభవ్‌ నగర్‌ పార్క్‌, రత్నానగర్‌, సత్యా నగర్‌ రిటర్నింగ్‌ వాల్‌, అంబర్‌ పేట డివిజన్‌ పరిధిలోని ముస్లింల గ్రేవీ యార్డ్‌ దాదాపు పూర్తిగా పనులు ముగింపు దశలో ఉంది, అంబర్‌ పేట దిల్‌సు ఖ్‌నగర్‌, పోలీస్‌ లైన్‌లో అత్యుత్తమ లైటింగ్‌ సిస్టం, సెంట్ర ల్‌ మెరీడియన్సీ, బాక్స్‌ డ్రయినేజీ పనులు, ఫుట్‌ పాత్‌ లా డివైడర్‌ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. 30, 40 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డ్రయినేజీ పనులు, లో ప్రెషర్‌ వాటర్‌, సీసీ రోడ్డు నిర్మాణ పనులు పేదలకి మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు నిత్యం సేవా కార్యక్రమాలను పేదలకు తన వంతు సొంత నిధులతో రేకుల షెడ్డులు, కొంతమంది ఇల్లు నిర్మాణాలు, సొంత ఖర్చులతో దాహన సంస్కారాలకి, పేద పూజారులకు నెల నెల జీతాఆలు ఇస్తూ అర్చకులకు నిత్యం సాయం చేస్తూ, సొంత నిధులతో ప్రతి కాలనీకి ఉచిత పవర్‌ బోరు సౌకర్యంతోపాటు నీటి కొరత లేకుండా చూస్తున్నారు. అంబర్‌ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల మన్ననాలు పొందుతున్న ఏకైక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అని నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు చెబుతున్నారు.
అంబర్‌పేట అభివృద్ధిని గత పాలకులు విస్మరించారు
అంబర్‌పేట నియోజకవర్గం అభివృద్ధి గత పాలకుల వల్ల కుంటు పడింది. నేడు నాలుగున్నరేండ్లుగా అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని రూ.వందల కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాను. మరో రూ. వంద కోట్ల నిధులు టెండర్‌ ప్రక్రి యలో ఉన్నాయి. అంబర్‌పేటను అందంగా, సుంద రీకరణగా తీర్చిదిద్దుతున్నా.ం భవిష్యత్తులో కూడా దాదాపు వివిధ డిపార్ట్మెంట్ల మంత్రుల అధికారుల సహా యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి నగరంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా అంబర్‌పేటను తీర్చి దిద్దుతానని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
ఆపదలో ఉన్న వారికి అన్న.. కాలేరు వెంకటేశ్‌
ఆపదలో ఉన్న వారు అన్నా అంటే నేనున్నాను అని నిరంతరం ప్రజలకు సహాయం చేస్తూ నిత్యం నియోజకవ ర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తూ, కొత్త పనులను ప్రారంభిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్నారు.
రాగుల ప్రవీణ్‌ పటేల్‌, బీఆర్‌ఎస్‌ టీడర్‌

Spread the love