ఎనిగ్మా నుంచి ఏంబియర్‌ ఎన్‌8

నోయిడా : విద్యుత్‌ వాహన తయారీ అంకురసంస్థ అయిన ఎనిగ్మా ఆటోమొబైల్స్‌ కొత్తగా ఏంబియర్‌ ఎన్‌8 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటిం చింది. ఇది ఒకే ఒక్క ఛార్జ్‌ పైన 200 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుందని పేర్కొంది. 2-4 గంటల్లో వేగంగా ఛార్జింగ్‌ అవుతుందని తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదని వెల్లడించింది. దీని ఎక్స్‌షోరూం ధరను రు.1,05,000 నుండి రు.1,10,000గా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రయాణికులు, సరుకు రవాణకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

Spread the love