నవతెలంగాణ- నిజాంసాగర్ : మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరస్తా సమీపంలో గల నేషనల్ హైవే 161 పై గురువారం ఉదయం హైదరాబాదు నుండి దెగ్లూరు వెళ్తున్న అంబులెన్స్ యాక్సిడెంట్ కి గురి అయింది అని నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ తెలిపారు. అయినా తెలిపిన వివరాల ప్రకారం… నాందేడ్ జిల్లా దెగ్లూర్ మండలం జైగవ్ గ్రామానికి చెందిన సాత్విక్ అనే బాబుకి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేసుకొని తిరిగి వస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నదని ఆయన తెలిపారు. అంబులెన్స్ లో ఉన్న సాత్విక్ (5) ప్రమాద స్థలంలోనే మృతి చెందాడని ఆయన తెలిపారు. తండ్రి ఉమాకాంత్ శంకర్రావు మానే దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.