ఇజ్రాయిల్‌కు పూర్తి విజయం : అమెరికా

ఇజ్రాయిల్‌కు పూర్తి విజయం : అమెరికాగాజాలో హమాస్‌పై ఇజ్రాయిల్‌ నిర్ణయాత్మకంగా విజయం సాధించగలదని అమెరికా విశ్వసించడం లేదని విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీ కర్ట్‌ కాంప్‌బెల్‌ అన్నాడు. ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ మధ్య పోరు గత వారం ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. పశ్చిమ జెరూసలేం హమాస్‌ను నాశనం చేస్తానని చేసిన ప్రతిజ్ఞ నుండి వైదొలగడానికి నిరాకరించింది. ” కొన్నిసార్లు మేము ఇజ్రాయిల్‌ నాయకులను నిశితంగా పరిశీలించినప్పుడు, వారు యుద్ధభూమిలో ఏదో ఒక విధమైన సంపూర్ణ విజయాన్ని సాధించాలనే ఆలోచన గురించి ఎక్కువగా మాట్లాడతారు” అని సోమవారం ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన నాటో యూత్‌ సమ్మిట్‌లో కాంప్‌బెల్‌ అన్నారు. ”అది సాధ్యమని మేము నమ్మటం లేదు” అని అతను చెప్పాడు.
ఇజ్రాయిల్‌ సైన్యం యొక్క తరలింపు సూచనల ప్రకారం పాలస్తీనియన్‌ ఎన్‌క్లేవ్‌ యొక్క ఉత్తర భాగం నుండి పారిపోయిన శరణార్థులతో రద్దీగా ఉండే గాజాలోని దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడిపై వాషింగ్టన్‌, పశ్చిమ జెరూసలేం మధ్య తీవ్రమైన తేడాలు ఉన్నాయని అతను అంగీకరించాడు. ఈ ఆపరేషన్‌లో పౌర మరణాలు, ఎక్కువ మంది శరణార్థుల పెరుగుదలకు దారి తీస్తుందని అధ్యక్షుడు జో బైడెన్‌ విశ్వసిస్తున్నారని కాంప్‌బెల్‌ నొక్కిచెప్పాడు. కాంప్‌బెల్‌ మాటలు అతని బాస్‌, సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ గతంలో చేసిన ప్రకటనలను ప్రతిధ్వనించాయి. ఇజ్రాయిల్‌ గాజాలో హమాస్‌ను పూర్తిగా నిర్మూలించ జాలదని, పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ను పూర్తిగా ఆక్రమించడంలో ఇజ్రాయిల్‌ విజయం సాధించినప్పటికీ, ఐడీఎఫ్‌ విడిచిపెట్టిన తర్వాత మిలిటెంట్లు దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటారని ఆయన అన్నాడు.
ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, అతని యుద్ధ క్యాబినెట్‌ ఇప్పటివరకు తక్షణ కాల్పుల విరమణ కోసం చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదు. యూదు రాజ్యం మంచి కోసం హమాస్‌ నుండి ముప్పును తటస్థం చేయాలని పట్టుబట్టారు. ”మేము మా లక్ష్యాలను సాధిస్తాము – మేము హమాస్‌ను ఢకొీంటాము, మేము హిజ్బుల్లాను ఢకొీంటాము, మేము భద్రతను సాధిస్తాము” అని రక్షణ మంత్రి యోవ్‌ గల్లంట్‌ గురువారం నాడు చెప్పాడు. ఇజ్రాయిలీ సైన్యం రాఫాపై దాడులను కొనసాగిస్తే అది వేలాది పౌరుల మరణాలకు దారితీస్తుంది. ఇప్పటికే గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం చేసిన దాడులలో 35 వేలమందికి పైగా పాలస్తీనా వాసులు మరణించారు.

Spread the love