నవతెలంగాణ – కెంటుకీ : అమెరికా భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. కెంటుకీలో కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో అత్యధికంగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనపై కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ మాట్లాడుతూ… వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించాల్సి ఉందని అన్నారు. తల్లి, 7 ఏళ్ల బిడ్డతో సహా ఎక్కువ మంది మరణాలు కార్లు వరద నీటిలో చిక్కుకోవడం వల్ల సంభవించాయని బెషీర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని గవర్నర్ కోరారు. తుఫాను వలన దాదాపు 39,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరాను నిలిచిపోయిందని తెలిపారు. మరికొన్ని ప్రాంతాలలో కఠినమైన గాలులు అంతరాయం ఏర్పడవచ్చని బెషీర్ హెచ్చరించారు. కెంటుకీ, టేనస్సీలోని కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ సీనియర్ ఫోర్కాస్టర్ బాబ్ ఒరావెక్ తెలిపారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీగా గాలులు వీచడంతో ఆస్తులు ధ్వంసమయ్యాయి.