బంగ్లాదేశ్ జట్టు పై అమెరికా సంచలన విజయం

నవతెలంగాణ – హైదరాబాద్: 2024 టీ20 వరల్డ్ కప్ ముందు బంగ్లాదేశ్ జట్టు అమెరికా టూర్ కి వెళ్ళింది. ఇందులో భాగంగా జరిగిన మొదటి టీ20లో అమెరికా జట్టు బంగ్లాదేశ్ జట్టుపై గెలిచిన సంచలనం సృష్టించింది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెటిచిన అమెరికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన అమెరికా జట్టు.. 19. 3 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించారు. కాగా ఇంటర్నేషనల్ టీ20లో అమెరికా జట్టు బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. కాగా జూన్ 12 నుంచి జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టు కూడా ఉంది. ఈ విజయం ఆ జట్టుకు ప్రపంచ కప్ మ్యాచుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాగా టీ20 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్, అమెరికా దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి.

Spread the love