28న తెలంగాణకు అమిత్ షా..

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.  28న తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:05 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. అక్కడ బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ అనంతరం 2:55 గంటలకు కరీంనగర్ వెళ్లనున్న అమిత్ షా 3: 55 గంటలకు కరీంనగర్ కు చేరుకుంటారు. పట్టణంలో నిర్వహించే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జేఅర్సీ కన్వెన్షన్ లో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మేధావులతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. రాత్రి 7: 45 గంటలకు అమిత్ షా తిరిగి ఢిల్లీకి వేలుతారు.

Spread the love