మణిపూర్‌ మహిళా కార్యకర్తలపై అమిత్‌షా వ్యాఖ్యలు తగవు

Amit Shah's comments on Manipur women activists are inappropriate–  ఖండించిన ఒక్రమ్‌ ఇబోబి
ఇంఫాల్‌ : మణిపూర్‌ మహిళా కార్యకర్తలపై కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఆదివారం కాంగ్రెస్‌ నేత ఒక్రమ్‌ ఇబోబి ఖండించారు. మాదకద్రవ్యాలు, ఇతర సామాజిక దురాచారలపై పోరాడటం, నిషేధాన్ని అమలు చేయడంలో మహిళల పాత్ర గురించి హౌం మంత్రి అమిత్‌షా, ఇతర బీజేపీ నేతలకు తెలియదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని అన్నారు. ప్రస్తుత అంశాతి సమయంలోనూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో మహిళలు ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళల సహాయం లేకుండా మత ఘర్షణలను పరిష్కరించలేమని స్పష్టం చేశారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలంటూ పలువురు మహిళా కార్యకర్తలు ఢిల్లీలో నెలల తరబడి ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు యత్నించారు.మణిపూర్‌లో మహిళా కార్యకర్తలను అదుపులో పెడితే.. రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని పది రోజుల్లో పరిష్కరించగలమని కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా బీజేపీ నేతలతో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళా కార్యకర్తలు భద్రతా బలగాల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలతో పాటు పలువురు నేతల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అవినీతి, ఇతర అన్యాయాలకు వ్యతిరేకంగా మణిపూర్‌ మహిళా కార్యకర్తల పోరాటం నుంచి బీజేపీ నేతలు విలువైన పాఠాలు నేర్చుకోలేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల పోరాటాలు
నిర్బంధపు పనిని వ్యతిరేకిస్తూ.
. 1904 మార్చి 15 మహిళలు గొప్ప పోరాటాన్ని చేశారు. నిరసనకారులు బ్రిటీష్‌ అధికారుల బంగ్లాలను తగుల బెట్టారు. దీంతో నేరస్తుల గురించి సమాచారం ఇచ్చిన వారికిరూ. 500 బహుమతి ఇస్తామని బ్రిటీష్‌ వారు ప్రకటించినప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి నిర్బంధ పనిని తొలగించారు.
అధిక పన్నులను వ్యతిరేకిస్తూ 1934 లో రెండో పోరాటం చేపట్టారు. రాజుతో కుమ్మక్కై బ్రిటీష్‌ అధికారులు పలు అక్రమ పన్నులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకోవడాన్ని మహిళలు వ్యతిరేకించారు. ఒక గిరిజనుడు మూడు రూపాయలు ఇంటి పన్ను చెల్లించాల్సి వుండగా, లోయలో ఉండే వారు రెండు రూపాయలు చెల్లించాల్సి వుండేది. అలాగే బియ్యం ఉచితంగా ఎగుమతి చేయడం వల్ల కృత్రిమ కొరతను సష్టించడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. క్వింటా బియ్యాని ఒక్క రూపాయి లేదా 12 అణాలకు విక్రయించాలని మహిళలు వ్యాపారులను డిమాండ్‌ చేశారు. కొన్ని నెలల పాటు ఈ ఆందోళన కొనసాగింది. దీంతో ఇంఫాల్‌ నగరంలోని ఖ్వైరాంబంద్‌ మార్కెట్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఇప్పటికీ పలు అన్యాయాలకు, క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా ఈ మార్కెట్‌లోనే మహిళలు ఆందోళనలు చేపడుతుంటారు.

Spread the love