అమ్మమాట.. అంగన్వాడీ బాట..!

Ammamata.. Anganwadi path..!నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మండలం లోని చలకుర్తి సెక్టార్ లో పరిధిలోని చలకుర్తి అంగన్వాడీ 01 కేంద్రం లో మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంచార్జి సీడీపీఓ సువర్ణ మాట్లాడుతూ.. రెండున్నరేండ్లు దాటిన చిన్నారుల పేర్లను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి బోధించే విద్య అందించే సేవల గురించి వివరించారు. ప్రతి చిన్నారిని అంగన్వాడీకేంద్రంలో చేర్పించాలన్నారు. ఆంగ్ల విద్యాబోధనతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ గౌసియా బేగం, అంగన్వాడీ టీచర్ యాదమ్మ,ఆయా ఈదమ్ము, అంగన్వాడీ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, గ్రామస్తులు ఉన్నారు.
Spread the love