– మండలం పరిధిలోని రాయిచెడు లో వేపుగా పెరిగిన చిత్రం
నవతెలంగాణ – ఉప్పునుంతల
కోనో కార్పస్ అనే ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, ప్రజలు హడలిపోతున్నారు. మండలలో పలు గ్రామాలలో పచ్చదనం సుందరీకరణ కోసం ఈ మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఈ మొక్క వల్ల పర్యావరణానికి పలు విధాలుగా విఘాతం కలుగుతుందని, మాధ్యమాల్లో పత్రిక ప్రకటనల్లో ఎవరి నోట విన్న నలుగురు కలిసి మాట్లాడుకున్న ఇదే చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో నివాస గృహాలకు అతి దగ్గరలో ఉండటం వలన శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని, మండలాల ప్రజలకు లక్షల్లో నష్టం కలుగ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం దాదాపు గ్రామాల్లో రోడ్ల ఇరువైపులా సుందరీకరణ కోసం ఈ మొక్కలు పెంచుతున్నారు. నిటారుగా వేపుగా పెరిగి నిత్యం పచ్చదనంతో కలకలలాడే ఏ మొక్క తన దుష్ప్రభాలతో ఇప్పుడు ప్రజల్లో ఎవరి నోట విన్న ఈ మొక్కలను చూస్తానే దగ్గరికి వెళ్లాలంటేనే ఆ ప్రాంతంలో ఉండాలన్న ప్రజలు, ముఖ్యంగా యువత గ్రామాల్లో ఆందోళనకరంగా వ్యక్తం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఉప్పునుంతల మండలం పరిధిలోని ఉన్న గ్రామాలలో హరితహారంలో భాగంగా కొన్ని ఎండ్ల కింద నాటిన కొనో కార్పస్ చెట్లను పూర్తిగా తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించి మానవునికి, పక్షులకి ఎలాంటి ఉపయోగం లేని ఈ చెట్లను గుర్తించి తొలగించాలని, వాటి స్థానంలో పూలు చెట్లు, నీడనిచ్చే చెట్లు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా మొక్కలు పెంచాలని గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.