అంటువ్యాధుల నివారణకు ఏఎంపీఐ హెచ్‌హెచ్‌ఎఫ్‌ ఆస్పత్రి

Rangareddy– ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌, ఏఎంపీఐ-యూఎస్‌ఏ సహకారంతో షాహీన్‌నగర్‌లోని మసీదులో జ్వరాలు, అంటువ్యా ధుల చికిత్స కోసం ఏఎంపీఐ హెచ్‌హెచ్‌ఎఫ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 20 పడకల ఈ ఆస్పత్రిలో 5 పడకలతో ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కూడా ఉంది. ఇది గుండెపోటు రోగులకు కూడా చికిత్స అందించనుంది. పరిశుభ్రత లోపం, స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో టైఫాయిడ్‌, డెంగ్యూ, చికు న్‌గున్యా, డయేరియా వంటి అంటు వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. వీటికి చికిత్స చేయడానికి ఇన్‌పేషెంట్‌ సౌకర్యం ఆవశ్యకత దృష్ట్యా మసీదు మొదటి అంతస్తులో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏఎంపీఐ లక్ష డాలర్లను విరాళంగా అందించింది. దీని నిర్వహణ ఖర్చును కూడా అందించనుంది. ఇందులో ఆధునిక పరికరాలు, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌, పారా మానిటర్లు, డీఫిబ్రిలేటర్లు, సమర్థులైన వైద్యులు, నర్సుల బృందం కలదు. కుల,మతాలకు అతీతంగా రోగులకు ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఓల్డ్‌ సిటీలోని కిరాణా స్టోర్‌లో పని చేస్తున్న ఒంటరి తల్లి, ఈమె గౌస్‌నగర్‌ ప్రాంతానికి చెందినది. ఈమె కుమార్తె 11 ఏండ్లఅలేఖ్య ఈ కేంద్రంలో వైరల్‌ హెపటైటిస్‌, యూటీఐ కోసం అడ్మిట్‌ అయ్యింది. కాగా ఆమెకు ఉచితంగా చికిత్స అందించారు. విజయవంతంగా చికిత్స పొందిన మొదటి రోగులలో ఒకరు. 15 రోజుల క్రితం ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు 125 మంది రోగులకు ఉచితంగా చికిత్స అందించారు. 80 మంది పెద్దలు, 45 మంది పిల్లలు చికిత్స పొందారు. 40 శాతం మంది రోగులు ఎంటెరిక్‌ ఫీవర్‌కు, 30 శాతం మంది అక్యూట్‌ జీఈ, 10 శాతం న్యుమోనియా, డెంగ్యూ తదితర చికిత్స పొందారు. ఇప్ప టివరకు చికిత్స పొందిన 125 మంది రోగుల మొత్తం పొదుపు రూ. 75 లక్షలు. ఈ ప్రాంతంలో ఆరో గ్య సౌకర్యాలు అంతగా లేవు. ఈ కేంద్రం రోజువారీ వేతన జీవులు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న పేద రోగులకు ఒక్కో బెడ్‌కు రోజుకు రూ. 5వేల నుంచి రూ.10వేల వరకు ఆదా చేస్తుందని అంచన. ట్రాపికల్‌, ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ సెంటర్‌ను బోర్డ్‌ఆఫ్‌ ఏఎంపీఐ యూఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్‌ జైనాబ్‌ బేగ్‌ లాంఛనంగా ప్రారంభించారు. యూఎస్‌ఏలోని కార్నెల్‌ యూనివర్శిటీ ఎన్వై నుంచి ఉన్నత ఇంట ర్నల్‌ మెడికల్‌ కన్సల్టెంట్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థి, మసీదు అధ్యక్షుడు, జమి యత్‌ అహ్లే హదీస్‌ సభ్యుడు జనాబ్‌ హబీబ్‌ అక్వీల్‌ సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి ముజ్తబా హసన్‌ అస్కారీ మాట్లాడుతూ..ఈ కాలంలో అంటు వ్యాధులు అధికంగా ప్రబలు తున్నాయి. ఈ ప్రాంతంలో నివాసితుల కోసం ఏర్పాటు చేశామన్నారు.

Spread the love