తెలంగాణలో అమృత-ప్రణయ్ తరహా ఘటన..యువకుడిని ఇంటికి పిలిచి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో అమృత-ప్రణయ్ తరహా ఘటన మరొకటి తెరపైకి వచ్చింది. తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి పై యువతి పేరెంట్స్ దాడి చేశారు. హైదరాబాద్ లో ఈ సంఘటన జరిగిందట. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది ఓ జంట. అయితే.. ఆ యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు యువకుడి పై కేసు నమోదు అయింది. ఇక ఈ తరుణంలోనే జైలు శిక్ష అనుభవించి.. బెయిల్ పై బయటకు వచ్చాడు ఆ యువకుడు. జైలు నుంచి వచ్చిన తర్వాత యువతికి దూరంగా ఉంటున్నాడు యువకుడు. ఈ నేపథ్యంలోనే మనకు కొడుకు పుట్టాడు.. చూడటానికి అయినా రమ్మని యువతితో బలవంతంగా ఫోన్ చేయించారట యువతి పేరెంట్స్. ఇక ఆ యువతి మాటలు నమ్మి ఇంటికి వచ్చాడట ప్రియుడు అబ్దుల్ సాహెల్. ఇక సాహిల్ ను బంధించి దాడి చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు యువకుడు. దీంతో యువతి కుటుంబంపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Spread the love