తెలంగాణలో ఎంసెట్‌ కౌన్సెలింగ్ ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ 2023 ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి జులై 5వరకు రుసుం చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే రూ.600ల చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈ నెల 28నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అభ్యర్థులు 28 నుంచి జులై 8వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tseamcet.nic.in/లో తెలుసుకోవచ్చు.

Spread the love