నవతెలంగాణ-హైదరాబాద్ : పాటియాలా: పంజాబ్‌లోని పాటియాలాలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. సుమారు 10 రాకెట్లకు చెందిన అమ్యునీషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రాజ్‌పురా రోడ్డు మార్గంలో ఉన్న ఓ చెత్తకుప్పలో ఆ రాకెట్ సామాగ్రిని కనుగొన్నారు. అనుమానిత సామాగ్రి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అధికారులు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. 2022లో పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లా పోలీసు స్టేషన్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనేడ్(ఆర్పీజీ) దాడి జరిగిన విషయం తెలిసిందే. పాటియాలా నుంచి ఆ పోలీసు స్టేషన్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ మధ్యే మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీసుపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే.