డెంగ్యూ వ్యాధికి 11 నెలల బాలుడు బలి

నవతెలంగాణ- రామారెడ్డి
 డెంగ్యూ వ్యాధికి 11 నెలల బాలుడు బలై మృతి చెందాడు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఇల్లందుల సౌందర్య- అన్వేష్ ల 11 నెల కుమారుడు అధ్యంత్ జ్వరంతో కామారెడ్డి శిశు రక్ష ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లగా, పది రోజులకు డెంగ్యూ వ్యాధి అని హైదరాబాద్ తరలించగా మృతిచెందాడని స్థానికులు తెలిపారు. వ్యాధిని గుర్తించడం, సరైన వైద్యం అందించడంలో కాలయాపన చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love