నవతెలంగాణ – హైదరాబాద్: వాట్సాప్‌లో త్వరలో ‘వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా ఏఐ’ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు మెటా AIతో వాయిస్ చాట్ చేయవచ్చు. ఇది 10 డిఫరెంట్ వాయిస్‌లు కలిగి ఉంటుంది. వాటిలో యూజర్లు దేనిని సెలక్ట్ చేసుకుంటే ఆ వాయిస్‌లోనే మెటా ఏఐ రిప్లై ఇస్తుంది. ఈ వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.