– అమిత్‌షాపై మహేష్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. భారత్ నిర్మాణంలో నెహ్రూ దూరదృష్టి అమోఘమైందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదన్నారు. నెహ్రూ, పటేల్ సమిష్టి నిర్ణయాల వల్లే తెలంగాణ విముక్తి జరిగిందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ దేశంలో బ్రిటీష్ వారి నీతిని అనుసరిస్తోందన్నారు. బీజేపీ ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోందన్నారు.
బ్యానర్లు కట్టుకుంటే ఐదువేలు ఫైనా? వీహెచ్
విజయభేరి సభ కోసం బ్యానర్లు కట్టుకుంటే రూ. 5వేలు, రూ. 10వేలు జరిమానా వేశారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు రూ. 2.95 లక్షలు ఫైన్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. మంత్రుల పుట్టిన రోజులకు, బీఆర్‌ఎస్ సభలకు పెద్ద పెద్ద కటౌట్లు కడితే ఎందుకు ఫైన్ వేయరని ప్రశ్నించారు. వారం రోజుల్లో రద్దు చేయకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్న చేస్తామని ఆయన హెచ్చరించారు.