నవతెెలంగాణ-ఓయూ
రెండు నెలలుగా ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవాల నీ, యూనివర్సిటీల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, డిగ్రీ కళాశాలలో రీసెర్చ్ సెంటర్ పేర ఆలోట్మెంట్స్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ మెస్స్ ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ వీసీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రికి పలుమార్లు సమస్యలు పరిష్కరించాలని కోరాం అని విద్యార్థులు అన్నారు. అయినా గత్యంతరం లేకపోవడంతో సమస్యలు పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ తొత్తు వీసీ అసమర్ధ వైఖరిని నిరసిస్తూ గురువారం పీహెచ్డీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం బొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విశవిద్యాలయాల సమస్యలను పరిష్కరించాలని లేదంటే రాబోయే కాలంలో విద్యార్థుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.