ఆవిర్భవిస్తున్న బహుళ ధ్రువ ప్రపంచం!

– నెల్లూరు నరసింహారావు
అమెరికా ఆధిపత్యంలోని ఏకద్రువ ప్రపంచాన్ని మార్చి మరింత సమతౌల్యంగల ప్రపంచం కోసం సోవియట్‌ పతనానంతరమే ప్రయత్నాలు మొదల య్యాయి. ఒకవైపు ఐక్యరాజ్య సమితి మౌలిక పాత్ర ను నిర్వహించేలా చేయటం, మరోవైపు ప్రధాన ప్రాబ ల్య రాజ్యాల సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయటం పై ఈ బహుళ ద్రువ ప్రపంచ ఆవిర్భావం ఆధార పడింది. ఈ బహుళ ద్రువత్వ భావన భారతదేశం, చైనాలను వంటి పెద్ద దేశాలను బాగా ఆకర్షించింది.
బహుళ ద్రువ ప్రపంచ సాధ్యతను పశ్చిమ దేశా ల నిష్ణాతులు కూడా కొట్టి పారేయలేదు. ఇది మెల్ల మెల్లగా భావి ప్రపంచ క్రమం(వరల్డ్‌ ఆర్డర్‌) ద్రుశ్యం గా ఆవిర్భవిస్తోంది. ఈ లోపు ప్రపంచ వాస్తవికత వేగంగా మారుతోంది. అంతర్జాతీయ సంబం ధాలలోని వివిధ రంగాలలో వివిధ స్థాయిల్లో పరిస్థితులు మారుతున్నాయి. మనం చూస్తు న్నది అసమ ప్రగతి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సంభవిస్తున్న మార్పుల వేగంలో వున్న తేడాలవల్ల ఘర్షణలు, ప్రతిఘటనలు తలెత్తుతున్నాయి. కొంతవరకైనా ఈ పరిణామాన్ని అర్థం చేసుకోగలగాలంటే దీన్ని నియంత్రించే కారకా లను, దీని గతిశీలతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంటుంది.
అంతర్జాతీ సంబంధాల అధ్యయనంలో ద్రువత్వ భావన 1970వ దశకం చివరి నుంచి ఉంది. ఈ రంగంలో నయా వాస్తవిక వాదాన్ని ప్రవేశపెట్టిన అమెరికన్‌ రాజకీయ శాస్త్రవేత్త, కెన్నెత్‌ వాల్ట్జ్‌ సైద్దాంతిక రచనలలో ద్రువత్వ భావన ప్రాచుర్యం పొందింది. ఇదే భావన స్ట్రక్చరల్‌, సిస్టెమిక్‌ సిద్ధాంతంగా సోవియట్‌ యూనియన్‌ లో, ఆ తరువాత రష్యాలో అభివ్రుద్ధి చెందింది. అంతర్జా తీయ యవనికపైన ప్రభుత్వాల చర్యలు పూర్తిగా తమతమ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా వర్తమాన ప్రపంచ క్రమ నిర్మాణాన్నిబట్టి ఉంటాయని నయావాస్తవిక వాదులు వాదిస్తారు. అలా జాతీయ ప్రయోజనాల, వ్యూహాల స్వరూపాన్ని ఈ ప్రపంచ క్రమం నిర్ణయిస్తుంది. ప్రాబల్య రాజ్యాల మధ్య పలు కుబడి పంపకంగా ఈ ప్రపంచ క్రమాన్ని నిర్వచించ వచ్చు. ఈ నిర్వచనం ఆధారంగా అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణాలను వర్గీకరించవచ్చు.
ఏక ద్రువ ప్రపంచంలో ఒకే ఒక దేశం ప్రాబల్య రాజ్యంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా సోవి యట్‌ యూనియన్‌ పతనం తరువాత 1990లో అమెరికా ఆధిపత్యం చెలాయించటాన్ని చూపవచ్చు. ద్విద్రువ ప్రపంచంలో పోటీపడుతున్న రెండు బలమై న దేశాల వెనుక సాపేక్షంగా బలహీన దేశాలు ఉండ టం జరుగుతుంది. ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరి కా, సోవియట్‌ యూనియన్లు ఈ స్థితిని ప్రతిబింబిం చాయి. మనం చేరుకోనున్న బహుళ ద్రువ ప్రపంచం లో ప్రాబల్యం వివిధ ప్రధాన దేశాలలోను, కూటము ల్లోను నిక్షిప్తమై ఉంటుంది. బహుళత్వ నిర్మాణం అత్యంత వ్యూహాత్మక వైవిధ్యాన్ని అనుమతిస్తుం ది.
వర్తమాన ప్రపంచ క్రమంలో దేశాలకు సైనిక సామర్థ్యం ఒక్కటే ఆయుధం కాదు. ప్రపంచం సైని కంగా కొంతవరకు బహుళ ద్రువంగా ఉన్న ప్పటికీ ఇతర రంగాలలో సామర్థ్యాలు భిన్నంగా ఉన్నాయి. గ్లోబల్‌ ఫైనాన్స్‌ లో చెల్లింపుల సాధనం గాను, రిజర్వ్‌ కరెన్సీగాను అమెరికన్‌ డాలర్‌, అమెరి కన్‌ బ్యాంకులు ఆధిపత్య పాత్రను పోషిస్తున్నాయి. చరిత్రలో ఎన్న డూ జరగని విధంగా రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్ష లవల్ల సెటిల్‌ మెంట్ల సాధనాలు మారిపోతు న్నాయి. రష్యాపైన విధించిన ఆంక్షలు ప్రపంచ దేశాలను ముఖ్యంగా పశ్చిమ దేశాల పలుకుబడిలోలేని దేశా లను ఆలోచింపజేస్తున్నాయి. ఈ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను అమెరికా డాలర్‌కు దూరం జరుపుతు న్నాయి. దీనిలో చైనా ప్రధాన పాత్రను పోషిస్తోంది.
అలాగే ప్రపంచ సాంకేతిక సామర్థ్యంపై పశ్చిమ దేశాల ఆధిపత్యం దాదాపు యధాతథంగా ఉంది. ఈ రంగంలో చైనా గణనీయమైన విజయాలు సాధించి నప్పటికీ పశ్చిమ దేశాల లైసెన్సులు, సాంకేతికత, ముఖ్య విడిభాగాలు, ఉత్పత్తులు గ్లోబల్‌ సరఫరా చైన్ల లో ఇంకా అంతర్భాగంగా ఉన్నాయి.
పోటీ విపరీతం గా వున్న రంగాలలో డిజిటల్‌ స్పేస్‌ కూడా ముఖ్య మైనదే. గ్లోబల్‌ డిజిటల్‌ సర్వీస్‌ నెట్‌ వర్క్స్‌ మీద పశ్చిమ దేశాల పట్టు ఇంకా చాలా బలంగా ఉంది. ఈ విషయంలో చైనా చాలా ముందే మేల్కొని తన స్వంత డిజిటల్‌ ఇకో సిస్టమ్‌ ను అభివ్రుద్ధి చేసు కుంది. ప్రస్తుతం చైనా, రష్యాలు మూడవ ప్రపంచ దేశాలకు ”డిజిటల్‌ సార్వభౌమత్వాన్ని” అందించే సాంకేతికతను సరఫరా చేస్తున్నాయి.
ఇలా వివిధ అవాంతరాల మధ్య వర్తమాన ప్రపంచ క్రమం ఏక ద్రువత్వం నుంచి బహుళ ద్రువత్వంవైపు పయనిస్తోంది.

Spread the love