కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోద భరిత చిత్రం

A must watch with the whole family An entertaining filmనితిన్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్‌ మూవీస్‌, రుచిర ఎంటర్టైన్మెంట్స్‌, ఆదిత్య ఎంటర్టైన్మెంట్‌ మూవీస్‌ బ్యానర్ల పై ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పకులు. ఈనెల 8న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌ మీడియాతో పలు విశేషాలు
షేర్‌ చేసు కున్నారు.
రెండున్నరేళ్ల క్రితం వక్కంతం వంశీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ లైన్‌ చెప్పారు. ఈ మూవీలోని ప్రతీ సీన్‌, ప్రతీ డైలాగ్‌ వక్కంతం వంశీనే రాశారు. ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో జూనియర్‌ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌ పోషించాను. అలా అని వారికి ఉండే కష్టాలను చూపించలేదు. ఈ మూవీలో స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వక్కంతం వంశీ రాసిన క్యారెక్టర్లలో ఈ కారెక్టర్‌ ది బెస్ట్‌ అని చెప్పొచ్చు.
ఇందులో ఫాదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌ కాకుండా ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది. ఇలాంటి ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్టైన్మెంట్‌ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని మా అభిప్రాయం. కుటుంబమంతా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా తెరకెక్కించాం. ఈ చిత్రంలో రావు రమేష్‌ పాత్ర తరువాత సంపత్‌ త్రకే జనాలు ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. ఓ కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఎలా ఉంటుందో.. శ్రీలీల పాత్ర అలానే ఉంటుంది. రాజశేఖర్‌ పాత్ర సెకండాఫ్‌లో ఉంటుంది. ఆయన వచ్చాకే సినిమా నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్తుంది. హారిస్‌ జయరాజ్‌ సంగీతం నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మెలోడీస్‌ ఇస్తారు. ఇందులో అన్ని రకాల పాటలు బాగా ఇచ్చారు. ఆర్‌ఆర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నాగవంశీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. నెక్ట్స్‌ వారి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. నాకు దైవ చింతన, భక్తి ఎక్కువ. మళ్లీ ఆ జోనర్‌లో ఓ సినిమా చేయాలని ఉంది. ‘శ్రీ ఆంజనేయం’ తరువాత మళ్లీ నాకు అలాంటి కథలు ఎవ్వరూ చెప్పలేదు. ఎవరైనా అలాంటి కథతో వస్తే సినిమా చేస్తా. వెంకీ కుడుములతో చేస్తున్న సినిమాలో ముందుగా రష్మికను హీరోయిన్‌గా అనుకున్నాం. కానీ ఆమెకు డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చారు. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను కామెడీ చేస్తే.. ఆ సినిమాలో శ్రీలీల కామెడీ చేస్తుంది. అందులో శ్రీలీల క్యారెక్టర్‌ ఇంకా బాగుంటుంది. వేణు కుడుముల మూవీని మూడు వారాలు షూట్‌ చేశాం. అలాగే వేణు శ్రీరామ్‌ తమ్ముడు సినిమాకు రెండు వారాలు చిత్రీకరణ చేశాం. ఇకపై ఈ రెండూ సమాంతరంగా చేస్తాను. ‘మాస్ట్రో’ లాంటి డిఫరెంట్‌ కథలు, క్యారెక్టర్లు వస్తే చేయటానికి రెడీగా ఉన్నాను.

Spread the love