అలరించే మ్యూజికల్‌ ఫిల్మ్‌

మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్కేఎన్‌ నిర్మాణంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను కథానాయిక రష్మిక మందాన్న రిలీజ్‌ చేసి, ఈ సాంగ్‌ తనకెంతో బాగా నచ్చిందని చెప్పారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ,’ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ‘ప్రేమిస్తున్నా’ పాటని వింటాం’ అని అన్నారు. సాయి రాజేష్‌ మాట్లాడుతూ,’ఈ పాట బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది, సినిమాను జూలై 14న రిలీజ్‌ చేయబోతోన్నాం’ అని చెప్పారు.’ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్‌ రావడానికి కారణం విజరు బుల్గానిన్‌, పవన్‌ కళ్యాణ్‌. విజయ్‌ టాలెంట్‌ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్‌ అయ్యాయి’ అని నిర్మాత ఎస్‌కేఎన్‌ అన్నారు.

Spread the love