
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో శనివారం సాయంత్రం ఏర్పడిన ఇంద్రధనుస్సు కనువిందు చేసింది.ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంటూ సాయంత్రం 4.30 గంటలకు ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి.వర్షం కురిసింది. వర్షం వెలిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడింది. సుమారు 20 నిమిషాల పాటు ఉన్న ఇంద్రధనస్సు గ్రామీణ వాసులకు కనువిందు చేసింది. దీంలో యువకులు సెల్ ఫోన్లులో ఈ చిత్రన్ని బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.