ఆరు నెలలుగా జీతాలు ఇవ్వని ఐటీ కంపెనీ 

An IT company that has not paid salaries for six monthsనవతెలంగాణ – మియాపూర్ 
ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటూ కార్మికులను రోడ్డుపై పడేసిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐటి ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రోడ్డులోని హుడా కాలనీ డీఎస్ ఆర్ ఇన్స్పైర్ ప్లాట్ నెంబర్ 21లో ఆన్ పాసివ్ టెక్నాలజీస్ పేరును ఓ ఐటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో 500లకు పైగా ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. అయితే వీరికి గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీనిపై పలుమార్లు ఉద్యోగులు సంస్థ యాజమాన్యాన్ని జీతాలు ఇవ్వాలని కోరినా ఏమాత్రం స్పందించడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అంతర్గతంగా పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి సంస్థ ఏ మాత్రం స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.
Spread the love