చొక్కా లేకుండా సమావేశాలకు హాజరైన అధికారి..

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి కార్యాలయ సమావేశానికి చొక్కా లేకుండా హాజరయ్యాడు. దీంతో అతడిపై అధికారులు వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ విజయ్ కిరణ్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. శాఖాపరమైన ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్న సమయంలో ఓ అధికారి చొక్కా లేకుండానే ఈ సమావేశానికి హాజరయ్యాడు. కేవలం బనియన్ తో సమావేశంలో పాల్గొన్నాడు. అతడిని చూసిన ఇతర అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో కార్యాలయ సమావేశానికి అనుచిత వేషధారణతో హాజరైన ఆ అధికారిపై విజయ్ కిరణ్ చర్యలకు ఉపక్రమించారు. అధికారిని సస్సెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టింది.

Spread the love