నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈనెల 13వ తారీఖున జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా వృద్ధులకు ఓటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన పాతనబోయిన ముత్తమ్మ (85)ఇంటికి ఎన్నికల అధికారి వచ్చి తమ ఓటు హక్కును వేయమని కోరగా ఓటు హక్కని వినియోగించుకున్నది. ఈ వయసులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అధికారులే మా ఇంటికి వచ్చి ఓటు వేయమని కోరడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.