భూ తగాదాలో తమ్ముడిని కడతేర్చిన అన్న

– సాగునీటి వివాదం ప్రాణం తీసింది
నవతెలంగాణ – కోహెడ
తోడబుట్టిన వారితో ఉన్న బలం మరేఇతర సంబంధాలకు సరికాదాని చాటి చెప్పాల్సిన దానికి భిన్నంగా స్వంత తమ్ముడినే కడతేర్చిన సంఘటన మండలంలోని వింజపల్లి గ్రామంలో జరిగింది. పోలిసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వింజపల్లి గ్రామానికి  చెందిన కొమ్ముల శ్రీనివాస్‌రెడ్డి, కొమ్ముల తిరుపతిరెడ్డి ఇరువురు అన్నదమ్ములకు తన తండ్రి ఇచ్చిన వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటున్నారు. అలాగే పాలుగా వ్యవసాయ బావిని ఇరువురు అన్నదమ్ములు వాడుకుంటున్నారు. దీంతో చెరొకరోజు వ్యవసాయ బావిని తమ పొలాలకు వాడుకుంటూ సాగుచేసుకుంటున్నారు. ఎప్పటిలాగే వ్యవసాయ పొలాన్ని తనవంతుగా మంగళవారం రోజు నీటిని శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ పొలాలకు వదిలివేయగా అక్కడికి చేరుకున్న అన్న తిరుపతిరెడ్డిల మధ్య ఘర్షణ మొదలైంది. తనవంతు అంటే తనవంతనే భావన ఇరువురి మధ్య పెరగడంతో తిరుపతిరెడ్డి గొడ్డలితో శ్రీనివాస్‌రెడ్డిపై వేటు వేశాడు. దీంతో అక్కడికక్కడే శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందాడు. మృతిడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
Spread the love