ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించిన ఒలింపిక్ షూటర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత సరబ్‌జ్యోత్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించారు. తన స్వరాష్ట్రం హరియాణా క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. కానీ సరబ్ ప్రభుత్వ వినతిని సున్నితంగా తిరస్కరించారు. ‘నేను షూటర్‌గానే కొనసాగాలనుకుంటున్నా. ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే నా లక్ష్యం కోసం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతానికి ఈ జాబ్ చేయలేను’ అని ఆయన పేర్కొన్నారు.

Spread the love