ముమ్మరంగా కొనసాగుతున్న తైక్వాండో ఉచిత వేసవి క్రీడా శిబిరం

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని బయ్యక్కపేట గ్రామంలో తెలంగాణ పోలీస్ కోచ్ డైరెక్టర్ పాయం సురేష్ శిష్యుడు చందా హనుమంతరావు ఆధ్వర్యంలో తైక్వాండో కరాటే వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఈనెల మే 1 నుంచి ముమ్మరంగా కొనసాగుతుంది. ములుగు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి తీరగల శిక్షణ శిబిరం ముమ్మురంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విద్యార్థులు శిక్షణ శిబిరాలలో క్రమశిక్షణతో కూడిన క్రీడా విద్యను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా టైక్వాండో కోచ్ చంద హనుమంతరావు మాట్లాడుతూ టైక్వాండో కరాటే విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, వ్యక్తిగతంగా రక్షణ ఉంటుందని అన్నారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వం అందిస్తున్న వేసవి ఉచిత తైకాండో శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love