యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్‌లైన్‌ గేమ్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నెక్కొండ మండలం అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన బాషబోయిన ఉదయ్‌ శుక్రవారం రాత్రి ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. ఇటీవల ఉదయ్‌ తండ్రి ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50వేలు అతని తల్లి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. గేమ్‌ ఆడిన ఫోన్‌కి తల్లి బ్యాంకు ఖాతా లింక్‌ అయ్యి ఉంది. దీంతో ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పెట్టి రూ.40వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love