– ప్రధాని వచ్చిన దక్కని ఫలితం
– రెండు చోట్ల ఈటెల ఓటమి
నవతెలంగాణ-గజ్వేల్
మాజీ మంత్రి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ రెండు చోట్ల ఊహించని ఓటమి చవిచూశారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగింది. హుజురాబాద్‌లో సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసిన ఆయన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇప్పటివరకు ఏడుసార్లు కమలాపురం, హుజరాబాద్ శాసనసభ నుండి పోటీ చేసి ఓటమి ఎరుగని నాయకునిగా పేరుగాంచారు ఈటెల రాజేందర్. ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని రాజకీయ కసితో గజ్వేల్ బరిలో నిలిచి సీఎం కేసీఆర్ చేతిలో ఓటమి చెందారు. ఆరుసార్లు బీఆర్‌ఎస్, ఒక్కసారి ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచిన ఆయన ఆ స్థానాన్ని కాపాడుకోలేక మిగతా చోట్ల అడుగు పెట్టడంతో ఇక్కడ గజ్వేల్ ప్రజలు, అక్కడ హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ నమ్మలేకపోయారు. దీంతో రెండు చోట్ల ఓటమి తప్పలేదు. గజ్వేల్, హుజురా బాద్ ప్రజలు ఈటల రాజేందర్‌కు మంచి గుణపాఠం చెప్పారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్నది పోయింది రాని స్థానాన్ని కోసం గజ్వేల్కొచ్చి మరింత పరువు తీసుకున్నారని చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం బీసీ ముఖ్యమంత్రిగా ఈటల రాజేందర్‌ను చేస్తానని గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ బహిరంగ సభలో రాజేందర్‌ను చూస్తూ ప్రసంగించారు. ప్రధానమంత్రి చెప్పినా గజ్వేల్ ప్రజలు అభివద్ధి దష్టిలో పెట్టుకొని కెసిఆర్‌ని గెలిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ బిజెపి అభ్యర్థులు ఓటమి చవిచూశారు. దుబ్బాక గజ్వేల్‌లో మాత్రమే ఓట్లను బిజెపి అభ్యర్థులు రాబట్టుకున్నారు. మిగతా చోట్ల అంతంతగానే ఉన్నది. గజ్వేల్‌లో గెలిస్తే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని స్థానిక ప్రజలు ఆలోచించినట్లు పరిశీలకులు అంటున్నారు.