నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమయిందని రెంజల్ ఎస్సై ఈ సాయన్న పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉంటుందని, మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే రెంజల్ పోలీస్ స్టేషన్ నెంబర్ (8712659847) సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మృతుడికి నీలిరంగు నిక్కర్ ధరించి ఉన్నాడని, మృతుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడ లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడు నా కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.