గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

– క్లూస్‌ టీంతో పోలీసుల విచారణ
నవతెలంగాణ-జిన్నారం
జిన్నారం మండలం మంగంపేట శివారులో గుర్తు తెలియని కాలిన మహిళా మతదేహం శనివారం లభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంఘటనా స్థలాన్ని పటాన్చెరువు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జిన్నారం సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ వేణు కుమార్‌, ఎస్సై విజయ రావు పోలీసు బందంతో కలిసి పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం… మంగంపేట శివారులోని బొమ్మనకుంట ప్రాంతంలో గుర్తుతెలియని 25 సంవత్సరాలు వయసు గల మహిళా మతదేహం పడిఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళా మతదేహం పూర్తిగా కాలిన గాయాలతో ఉంది. గుర్తు తెలియనివారు పెట్రోల్‌, డీజిల్‌ పోసి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. మహిళ మతదేహం చెవి కమ్మలు, కాలిమట్టెలు ఉన్నాయని చెప్పారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందన్నారు. మతదేహానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదన్నారు. ఎవరైనా గుర్తుపట్టినచో ఎస్సై విజయరావ్‌ సెల్‌ 8712656750, సిఐ వేణు కుమార్‌ సెల్‌ 8712656730లకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love