గాంధారి వంతెన సమీపంలో గుర్తు తెలియని మహిళా శవం లభ్యం

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని వంతెన సమీపంలో  గుర్తు తెలియని శవం లభ్యం అయ్యింది గాంధారి మండల కేంద్రంలో గల వంతెన సమీపంలో పాడుబడ్డ బాయిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి గొనె సంచిలో కట్టి పైన ప్లాస్టిక్ సంచిలో కట్టి బాయిలో పడేసినట్టు తెలుస్తుంది. మహిళా శవం కుళ్ళిన స్థితిలో ఉండి గులాబీ రంగు చీర జాకెట్ తో ఉండి ఉన్నది. ఇట్టి మహిళ ఇటీవల మిస్ అయిన గాంధారి కి చెందిన బుర్రి కీర్తన(19) గా అనుమానం కలదు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం  కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించమని గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు
Spread the love