గుర్తుతెలియని వాహనము ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:  మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 పైన గుర్తు తెలియని వాహనము ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు. శనివారం  రాత్రి సుమారు 2:30 కు జక్రంపల్లి బ్రిడ్జి దగ్గర హైవే పైన హైదరాబాద్ వైపు వెళ్ళు రోడ్డు పైన ఒక మగ వ్యక్తి వయసు  50 నుండి 60 సంవత్సరాలు ఉంటది ఈయనకు గుర్తుతెలియని వాహనం టక్కరి ఇవ్వగా అతని నడుము నుండి కాళ్ళ వరకు నుజ్జునుజ్జు ఐ అక్కడికక్కడే చనిపోయినాడు  దీనిపై కేసు నమోదు చేయడమైనదని తెలిపారు. చనిపోయిన వ్యక్తి పసుపు రంగు టీ షర్టు వేసుకుని ఉన్నాడు ఈ చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎవరైనా గుర్తు పడితే  జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ 8712659853 కి తెలుపగలరని తెలియజేశారు.
Spread the love