చెరువులో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో ఒక గుర్తించాలని మహిళ శవం లభ్యమైనట్లు ఎస్సై మహేష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 42-45 సంవత్సరాల వయస్సున్న ఒక గుర్తిని మహిళ ఘన్పూర్ గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘనపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు చెరువుకి వెళ్లి పరిశీలించగా ఒక గుర్తుతెలియని మహిళ శవం పైకి రావడంతో సఫాయి కార్మికులు నవీన్, రమేష్ లతో మృతదేహాన్ని బయటకు తీయించడం జరిగిందన్నారు. మృతురాలి ఒంటిపై దుప్పటి చీర బట్టలు ఉన్నాయని మిగిలిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో  పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్ట్మాస్టర్ నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చరికి తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Spread the love