– న్యూజెర్సీలో సీఎం రేవంత్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూని వర్సిటీ’కి చైర్మెన్‌గా ప్రఖ్యాత పారి శ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత, పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ యూని వర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరిం చాలంటూ తాను కోరటంతో ఆనంద్ మహీంద్ర అంగీకరించారని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. తెలంగాణ యువతను ప్రపంచం లోనే ఉత్తమ నైపుణ్యం కలిగి నవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ -ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ స్కిల్ యూని వర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రము ఖుడినే అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి విదితమే.