అనన్య తేజకు విరివిగా దాతల ఆర్థిక సహాయం 

నవతెలంగాణ – గంగాధర: గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో తల్లిదండ్రులని కోల్పోయి అనాధ మిగిలిన అనన్య తేజకు దాతలు విరివిగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన దాతలు అనన్య తేజ ఇంటికి చేరి విరాళాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ జిల్లా నాయకులు బండపల్లి యాదగిరి రూ.10 వేలను ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా పలువురు దాతల సహకారంతో భావన ఋషి స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన వసూలు చేసి రూ. 40 వేలను అనన్య తేజకు అందించారు. అదేవిధంగా అనన్య తేజ ధీన పరిస్థితిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దృష్టికి పలువురు బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్ల చదువుకు అవసరమైన  ఏర్పాట్లు చేసేలా అధికారులకు తెలిజేస్తానని హామీ నిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేశుని ఈశ్వరయ్య, పద్మశాలి సంఘం గర్శకుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నదాస్ లక్ష్మీరాజం, భావన రుషి స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకులు అన్నదాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love