అచ్చంపేటలో అరాచకం ఓడింది

నవతెలంగాణ- అచ్చంపేట, అచ్చంపేట రూరల్‌: నా ప్రాణం ఉన్నంతవరకు అచ్చంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతా….! నన్ను ఓడించే మొనగాడు అచ్చంపేటలో పుట్టలేదని.. విలేకరుల సమావేశాలలో సభలలో సమావేశాలలో విర్రవీగిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. ఎదుటి మనిషిని ఎలా చేసి మాట్లాడడం అధికార అహంకారంతో విర్రవీగి చేసిన చేష్టలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దళిత సామాజిక వర్గాలు చెందిన ఎంతో మంది యువకులను ప్రజా సంక్షేమల పథకాలు అమలు తీరుపై ప్రశ్నించినందుకు పోలీసులతో కొట్టించాడని, కేసులు పెట్టించి జైలుకు పంపించాడని, అధికార అహంకారంతో విద్యార్థులతో ,ప్రజలతో పూలు చెల్లించుకోవడం జల్సాలు , దాడులు , అరాచకాలు, కీచకపర్వాలతో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో దళిత నాయకత్వానికి ఒక మచ్చలా మిగిలిపోయాడని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ జెండా మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా.
నల్లమల్ల ప్రజలకు ఆసరాగా నిలుస్తా
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకష్ణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ జెండా మోసిన ప్రతి కార్య కర్తలను నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకుం టానని, అచ్చంపేట ప్రజలకు అండగా నిలుస్తానని ఓట్ల లెక్కింపు కేంద్రంలో విలేకరులతో ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీ కష్ణ అన్నారు. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అను గుణంగా కాంగ్రెస్‌ పార్టీ పాలన ఉంటుందని పీసీసీి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం.. ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన విధానాన్ని ప్రజలకు చేరవ చేస్తామని చేస్తామని పేర్కొన్నారు. వంశీకష్ణ ఎమ్మెల్యేగా గెలుపొ ందడంతో పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు బాణసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చేయడానికి ప్రధానమైన చౌరస్తాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love