అచ్చంపేటలో అరాచకం ఓడింది

– దుర్మార్గపు నాయకుడు గువ్వలను ఓడించారు.
నవతెలంగాణ- అచ్చంపేట:  నా ప్రాణం ఉన్నంతవరకు అచ్చంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతా….! నన్ను ఓడించే మొనగాడు అచ్చంపేటలో పుట్టలేదని.. విలేకరుల సమావేశాలలో సభలలో సమావేశాలలో  విర్రవీగిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. ఎదుటి మనిషిని ఎలా చేసి మాట్లాడడం అధికార అహంకారంతో విర్రవీగి చేసిన చేష్టలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దళిత సామాజిక వర్గాలు చెందిన ఎంతో మంది యువకులను ప్రజాసంక్షేమల పథకాలు అమలు తీరుపై ప్రశ్నించినందుకు పోలీసులతో కొట్టించాడు కేసులు పెట్టించి జైలుకు పంపించాడు. అధికార అహంకారంతో విద్యార్థులతో ,ప్రజలతో పూలు చెల్లించుకోవడం జల్సాలు , దాడులు , అరాచకాలు,  కీచకపర్వాలతో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో దళిత నాయకత్వానికి ఒక మచ్చలా మిగిలిపోయాడు.
కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. నల్లమల్ల ప్రజలకు ఆసరాగా నిలుస్తా. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నవతెలంగాణ అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గం లోని కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తలను నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, అచ్చంపేట ప్రజలకఅండగా నిలుస్తానని ఓట్ల లెక్కింపు కేంద్రం లో విలేకరులతో  ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన విధానాన్ని ప్రజలకు చేరవ చేస్తామని చేస్తామన్నారు q. వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భాన సంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చేయడానికి ప్రధానమైన చౌరస్తాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Spread the love