ఆందోల్ మైసమ్మకు పూజలు మునుగోడు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: దండు మల్కాపురం గ్రామం వద్ద ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుకొని మునుగోడు బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోజు శంకరాచారి బుధవారం చండూరుకు నామినేషన్ కేంద్రానికి భారీ ర్యాలీతో వెళ్ళారని చౌటుప్పల్ మండల బిఎస్పి అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆందోజు శంకరాచారి మాట్లాడుతూ ఆందోల్ మైసమ్మ ఆశీస్సులు నాపై ఉండాలని, బహుజన బిడ్డగా మునుగోడు ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ ఏర్పుల అర్జున్,నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ పల్లె లింగస్వామి,మీడియా ఇన్చార్జి ఏర్పుల క్రాంతి కుమార్, గాదె సంతోష, మల్కాపురం గ్రామ శాఖ అధ్యక్షులు మాధ రమేష్, కే.నరసింహ, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love