జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం

నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ బి ఎస్ కే వైద్య బృందం హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత గల విద్యార్థులను గుర్తించి వారికి ఐరన్ మాత్రలతో పాటు వివిధ రకాల మందులను అందజేశారు. ఈ పరీక్షలను డాక్టర్ విజయభాస్కర్, ఆరోగ్య కార్యకర్త పూర్ణ నిర్వహించారు. రక్తహీనత కలిగి ఉన్న వారందరికీ ఐరన్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love